‘నీకుపయోగపడుతుందో లేదో తెలీదుగానయ్యా ! నాకర్థమైందైతే ..ఏది ఈ యాభయ్ అయిదేళ్ళ వయసులో అర్ధవైందేంటంటే...చిన్నదైనా పెద్దదైనా చెప్పడానికి నిజం ఒకటే ఉంటది. దాన్ని ఎన్ని కాపీలు తీసినా, కాపీకి కాపీలు తీసినా...అసలు అసలే, నకలు నకలే. నకలు చూపించుకోడానికి ఉపయోగపడుతుందేమోకానీ చెల్లదయ్యా..’
రాజ రాజ చొర చిత్రంలో ఒక పాత్ర చెప్పిన..ఎప్పటికీ మారువకుడాని..మాటలివి.
తాను దారి తప్పానని తెలుసుకున్న వ్యక్తి తనను తాను మార్చుకున్నా..సమయం కలిసిరాక దెబ్బతిని...తన యజమాని దగ్గరకొచ్చినప్పుడు ఆ యజమాని తన జీవితానుభవాన్ని గురించి చెప్తూ అన్న మాటలివి.
‘చేసిన తప్పుకి తమంతట తాము శిక్ష కోరుకునేవారు మార్పుకి నాంది పలికినట్టే, మరో వాల్మీకి అయినట్టే’ నన్న చిత్రంలోని మరో పాత్ర మాటలు మనోఫలకంపై ముద్రించుకోదగినవి. శిక్ష సంగతి అటుంచితే స్వచ్ఛమైన, నిజమైన పాశ్చాత్తాపం, మళ్ళీ తప్పు చేయకూడదన్న నిర్ణయం ఎల్లప్పుడూ స్వాగతించవలసినదే. అటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండటం అన్నదే అసలైన పరీక్ష, శిక్షా కూడానూ
No comments:
Post a Comment