Good Novel. కొన్ని చోట్ల మధుబాబు ఈ తరహా ఇతర నవలల్లో ఉన్న సంఘటనలు యదాతథంగా రావడంతో, ఆయా సంఘటనలు చదివే సమయంలో తరువాత జరుగబోయేది ఏంటనేది ఊహకందుతుంది.
మనసును పాడుచేసే సీరియళ్ళు, లేనిపోని ఆవేశాన్ని కలిగిస్తూ, మనసంతా గందరగోళంగా చేసేసే సినిమాలకంటే ఇటువంటి నవలలు చాలా బెస్ట్ అని నా అభిప్రాయం. ఇప్పటి జనరేషన్ కి మాయలు, మంత్రాలు, కత్తి యుద్ధాలు, మాంత్రికులు అంటే హ్యారీపోట్టర్ వంటివి మాత్రమే గుర్తొస్తాయి. కానీ టివి అంతగా మన జీవితంలోకి రాకముందు తరాలకు హ్యారీపోట్టర్ లాంటివాటిని తలదన్నే ఎన్నో కథలు, నవలలు అందుబాటులో ఉన్నాయని తెలియదు. చందమామలు, బాలమిత్రలు వంటివి చదువుతూ, ఆ బొమ్మలను చూస్తూ ఊహాలోకంలో విహరించిన మన ఆనాటి బాల్యం నేటి ఎంతమంది బాలలు అనుభవిస్తున్నారు? ఆ అందమైన చల్లని వెన్నెల రాత్రులు, వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని కళ్ళవెంట నీళ్ళు కారుతున్నా, ఆవురావురుమంటూ తినడం, కరెంటు పోతే, బయట వర్షం పడుతుంటే దుప్పటి కప్పుకుని అలా వర్షాన్ని చూస్తూ ఆ చప్పుడు జోలపాటగా తెలియకుండానే నిద్రలోకి జారుకోవడం, సెలవు రోజుల్లో కాలాక్షేపంతోపాటు నాలెడ్జ్ పెంచే చందమామ వంటి పుస్తకాలు తిరగేస్తూ కూర్చోవడం, మండుటెండల్లోనూ చల్లని చెట్లకింద ఆడుకోవడం, పెద్ద పెద్ద అరుగులపై పిల్లలు, పెద్దలు చేరి అష్టాచమ్మా అటలు, కోతులను, ఎలుగుబంట్లను, పాములను ఆడిస్తూ పొట్టపోసుకునేవారు, జాతకాలు చెప్పే కోయవాళ్ళు, పండగొస్తే ఇండ్లలోని కొబ్బరిచెట్లపై నుంచి కొబ్బరి కాయలు దింపి, పందిళ్ళు వేసి సందడి చేసే పనివాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు, పెద్దోళ్ళు వంటల హడావిడిలో ఉంటే, అందంగా ముస్తాబై సీతాకోకచిలుకల్లా ఇల్లంతా కలియతిరుగుతుండే బోలెడంతమంది చిన్నారులు, సందడి చేసే కన్నెపిల్లలు ...గుర్తు తెచ్చుకుంటే ఎన్నో మధురస్మృతులు.
swarna kadgam novel pdf
1 comment:
Post a Comment