మనిషి పుట్టింది..పెరిగేది... చివరగా ఈ జీవితాన్ని చాలించి.. జ్ఞాపకాల్ని మనకు మిగిల్చేది.. ఈ సంఘటనలన్నీ జనం మధ్యలో.. జనం తోడుగా.. మన చుట్టుప్రక్కల వున్న జనాలను భాగస్వాములుగా చేసుకుని జరిగే ఘటనలు...
మనం పుట్టినప్పుడు.. మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించాలి.. మనం నలుగురిలో తిరిగేటప్పుడు.. జనం మనల్ని అభిమానించాలి(ప్రేమించాలి)... ఒక వయసుకు వచ్చిన తర్వాత.. మనకు తోడుగా నిలిచే భాగస్వామి మనల్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాలి.. మనకు వారసులు కలిగినప్పుడు.. వారు మనకు తోడుగా ఉండాలి..మనల్ని ప్రేమించాలి...
...పైన పేర్కొన్న ఈ ప్రేమ, అభిమానం..మన జీవితంలో, మన జీవితాన్ని మలుపు త్రిప్పే, మనం జీవించి ఉన్నంత కాలం తీవ్రమైన ప్రభావాన్ని చూపించే విషయాలు.. ఈ ప్రపంచంలో ఎన్నో జీవితాలు ఈ రెండు విషయాలలో కలిగే చిన్న చిన్న మార్పుల వలన తలక్రిందులైన దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి...
ఒక ఉన్నతమైన విద్యావంతుడు, సమాజం ఒక చిన్న కారణంతో వెలివేయడం వలన, సమాజానికి దూరమై.. ఈ సమాజంపై కోపంతో..అడవి లోకి వెళ్ళిపోయి, ఆ దారిన వచ్చే బాటసారులను చంపి, వ్రేళ్ళను కోసి ..ఆ వ్రేళ్ళను మాలగా మలచి..ధరించి.. అడవిలో తిరిగే ఒక , అనాగరిక "అంగుళ మాలి" గా మారడాన్ని చూసాం...
కేవలం.. ప్రజల మాటల వలన, భార్యా భర్తలు ఒకరికొకరు దూరమై, వారి జీవితం అడవిని కాసిన వెన్నెలగా మారడాన్ని మనం రాముని, అతని భార్య జానకిల జీవితంలో చూసాం..ఈ రెండు దృష్టాంతాలూ రెండు వేర్వేరు స్తితులను కలిగిన మనుషుల జీవితాలను మన కనుల ముందు వుంచుతున్నాయి..... ఒకరు సాధారణ జ్ఞాని, చదువరి అయితే, మరొకరు ప్రజలను పాలించే రాజు...
ఆ నాటికీ, ఈ నాటికీ, పరిస్తితులలో యే మార్పూ రాలేదు.. సమాజం..మంచి కంటే, చెడుకే దన్ను నిలువడం..ఈ నాటిది కాదు.. ఆ నాటి నుంచి... మనిషి..."సంఘ" జీవి ఐన నాటి నుంచీ కొనసాగుతూనే వుంది....
నేటికీ, ఎంతో మంది.. సమాజం నుంచి..ఏది ఐతే ఆశించకూడదో .. అదే.."ప్రేమ..సహాయం..ఆప్యాయత..."...ఆశించి...తమ జీవితాన్ని ముళ్ళ దారి చేసుకుంటున్న వాళ్ళు ఎందరో...!!!!

No comments:
Post a Comment