ఒక మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడంటారు. జ్ఞానాన్ని సంపాదించే సాధనంగా పుస్తక పఠనం అనాదిగా వస్తున్నది. ప్రపంచంలోని అనేక నాగరికతలకు సంబంధించిన విశేషాలు, వారి జ్ఞానం, మనకు వివిధ రూపాలలో లభ్యమవుతూ ఉంటాయి. మట్టి పలకలు తదితరాలపై వారి భాష ద్వారా భావితరాలకు తాము సంపాదించిన జ్ఞానాన్ని అందజేసిన ఆనాటి మానవులు తమ తరువాతి తరాలకు మార్గదర్శకులుగా నిలిచారు.
మారుతున్న కాలంతోపాటు మానవుల తీరులో నూ ఎంతో మార్పు వచ్చింది. అందరి కోసం పాటుపడే మంచితనం తగ్గి, స్వార్థపూరిత ఆలోచన లు హెచ్చుమీరాయి. నాకేంటి లాభం అనే లాభాల బేరీజులో దారితప్పుతున్న యువత తమ తరువాతి తరాలకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తున్న సంగతి గుర్తించలేకపోతున్నారు.
సినిమాలు యువతను చెడగొడుతున్నాయంటూ పలువురు ఆవేదన చెందుతుంటారు. కొన్ని సినిమాలే కాదు, టివిలలో ప్రసారమయ్యే అనేక కార్యక్రమాలు, అంతర్జాలంలో అందుబాటులో ఉంటున్న చెత్తా చెదారం యువత మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సరైన మార్గద ర్శనం లేకపోవడం, చుట్టూరా స్నేహితుల వ్యవహారశైలి, మనస్తత్వం ఇతరుల మనస్తత్వంలో కూడా మార్పును తీసుకువస్తున్నాయి.
చుట్టూ మంచి చెప్పేవారు ఉంటే యువతలో మార్పు వస్తుందనడానికి ఎందరో ఉదాహరణగా నిలుస్తుంటారు. ఆదివారం వస్తే చాలు జాలీగా జులాయిగా తిరిగేవారు కొందరైతే, అదే వయసు ఉన్న ఎంతో మంది యువత చేతిలో పవిత్ర గ్రంథాలను పట్టుకుని తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆ ఆదివారాన్ని గడపడం ప్రతిచోటా మనకు కనిపించేదే. ఏదైనా గుడికి వెళ్దామనేవారు మన యువతలో తక్కువ. ఒకవేళ ఎవరన్నా అలా అనుకున్నా అతనితోపాటు వచ్చేవారు తక్కువ. కా నీ ఇతర మతస్తులలో అలా ఆధ్యాత్మిక భావనలతో మసలే యువతకు మంచి గుర్తింపు ఉంది. ఎ వరైనా అలా దేవుని స్తుతించేందుకు వెళుతున్నానంటే అతనితోపాటు వచ్చేవారు తప్పకుండా ఉంటారు. ఆధ్యాత్మిక భావనలతో ఉండేవారు ఎంతో ప్రశాంతంగా ఉంటారని, మానసిక ఆందో ళన, బిపిలు వంటి సమస్యలు తలెత్తవని విదేశాలలో పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి.
అదేవిధంగా కొన్ని మంచి పుస్తకాలను చదివేవారు కూడా మంచి నడవడికతో ఎంతో హుందాగా నడుచుకుంటూ, సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారనే విషయం తరతరాలుగా ఎందరో నిజమని నిరూపిస్తూ తమ జీవితాన్నే ఉదాహరణగా మనముందుంచుతారు.
శెలవురోజొచ్చిందంటే తోటివారి ప్రోద్భలం, తమకు అంతగా నచ్చకపోయినా ఏదో హీరో చిత్రం వెళ్ళాలంటూ స్నేహితులు పెడుతున్న ఒత్తిడులు, ఫలానా సినిమా చూడలేదా, కొత్త సినిమా చూడలేదా అంటూ కొత్త సినిమా చూడకపోవడం ఒక తప్పన్నట్టుగా కొంతమంది మాటలతో పలువురు ‘నలుగురితో...’ అన్న రీతిన మసలుకుంటూ ఉంటారు. మంచి చిత్రం అనే డెఫినిషన్ పక్కన పెట్టి, తమకు నచ్చిన లేదా తమ గ్రూపులో అధికశాతం అభిమానించే ఫలానా హీరో సినిమా చూడాల్సిందే అనే తీరున కొంతమంది యువత ఉంటారు. ఇది ఒకరి వలన ఒకరు తెలీకుండానే ఉత్తేజితులవుతున్న కారణంగా జరుగుతున్న వ్యవహారం. అదే గ్రూపులో ఒక వ్యక్తి కొంతకాలం పాటు సినిమాలగురించి ఆలోచించే యువతతో కాకుండా, మంచి పుస్తకాలు చదువుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే యువతతో చేరినప్పుడు అతని సినిమాల ఆలోచన పోయి పుస్తక పఠనం, భగవంతుని స్తుతించడం, సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వంటి మార్పులు చోటు చేసుకోవడం అతని పరిసరాల ప్రభావమే.
హీరో అంటే నలుగురికీ ఆదర్శంగా నిలిచేవాడు అనే పరిస్థితి నించీ...రౌడీని మించి, విలన్ ని మించి వెధవ్వేషాలు వేసేవాడు అనే తీరున కొన్ని చిత్రాలు హీరోయిజం అనే పదానికే అర్థం మార్చేస్తుండటం విచారించవలసిన విషయం.
కామెడీ కూడా గతి తప్పుతోంది. ఎంతసేపూ కమేడియన్ ని హింసించి శాడిజాన్ని చూపించి అదే కామెడీ గా చిత్రీకరించే విధానం కామెడీ అనే మాటకు తప్పుడు అర్థాన్నిస్తోంది. ఒకప్పుడు రాజేం ద్రప్రసాద్, శ్రీలక్ష్మీ వంటివారు చేసే కామెడీలు ఎంతో సహజంగా ఉండేవి. అదేవిధంగా ఎవర్నీ నొప్పించకుండా, వారు నొప్పించబడకుండా ఉండేవి. అటువంటి పరిస్తితి నుంచి హీరో అంటే కమేడియన్ని కొట్టేవాడు అనే తీరున, కమెడియన్ అంటే అందరిచేతా చీత్కారాలు పొందేవాడు, తన్నులు తినేవాడు అనే తీరున కమెడియన్ల పాత్రలు మారుతుండటం దురదృష్టకరం.
ప్రజలలో మార్పు వచ్చినప్పుడే మంచి సినిమాలు కూడా వస్తాయన్న వ్యాఖ్యలు వినవస్తుంటా యి. నిజమే. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అనే ఆలోచన కాకుండా మంచి సినిమానా కాదా అనే ఆలోచనతో చిత్రాలను వీక్షించే ధోరణి ప్రజలలో పెరిగిననాడు ఖచ్చితంగా అధికశాతం మంచి సినిమాలే వస్తాయి.
ఇక పుస్తకాల విషయానికి వస్తే మన దేశంలోని ప్రతి భాషలోనూ ఎంతోమంది అత్యధ్భుతమైన సాహిత్యావిష్కరణ చేశారు. మన ప్రాచీన మానవుల దగ్గర్నుంచి ప్రస్తుతం మన చుట్టూరా ఉన్న సమాజం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణాలకు దూరంగా ఉంటున్న గిరిజనులు, వారి జీవన విధానం, వారి సమస్యలు, పర్యాటక ప్రాంతాలు, మన పూర్వీకులు నిర్మించిన అద్భు త కట్టడాలు, ఆనాటి ప్రజల ఆచార వ్యవహారాలు....ఇలా ..ఎన్నో ఎన్నెన్నో...
అటువంటి పుస్తకాలు చదువుతుంటే మనం కూడా ఆయా విషయాలపై అవగాహన పెంచుకోగ లం. దాంతోపాటు కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఆ వాతావరణాన్ని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది. ఆనాటి ప్రజలు, వారి సమస్యలు తదితర విషయాలను ా దగ్గర్నుంచి దర్శించిన భావన కలుగుతుంది. వివిధ భాషల పుస్తకాలు చదవడం ద్వారా ఆయా భాషలపై పట్టు పెంచుకోవడంతోపాటుగా ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, అక్కడి ప్రజలు, పరిస్తితు ల గురించి తెలుసుకోగలం.
కొంతమంది కొన్ని ప్రాంతాలను సందర్శించినప్పడు తమ అనుభూతులను నలుగురితో పంచు కుంటూ రాసే రచనలు, కొంతమంది కాల్పనికత జోడించి రాసే రచనలు వంటివి చదువుతు న్నంత సేపూ ఆ రచనలలో లీనమయిపోతాం. ఆయా రచనలలోని పాత్రలతో ఎంతో సాన్నిహి త్యాన్ని అనుభవిస్తూ ఆయా రచనలలో పాత్రలకు ఆయా సందర్భాలకు అనుగుణంగా ఉద్విగ్న తకు, సంతోషం, దుఃఖం వంటి భావోద్వేగాలకు గురవుతాం.
కొంతకాలంగా పలువురు ప్రముఖుల రచనలను చదువుతున్న నాకు పుస్తక పఠనం మీద ఆసక్తి పెరిగిందనే అనిపిస్తోంది. వంశీగారు తదితర ప్రముఖుల రచనలు కొన్ని మనసును హత్తుకుం టాయి. ఆయన రచనల్లోని మా దిగువ గోదావరి కథలు చదువుతున్నప్పుడు ప్రతి కథ కూడా ఒక కొత్త వాతావరణంలోకి నన్ను తీసుకువెళ్ళిపోయింది. నవ్వించింది, ఆలోొచింపజేసింది, కంటతడి పెట్టించింది. మొదటి నుంచి చివరి వరకూ ఆపకుండా చదివించింది. కథలు చదివిన తరువాత కొన్ని రోజుల వరకూ కూడా ఆ కథలోని పాత్రలు నా కళ్ళముందు కదలాడాయి.
వంశీగారి గోదావరి కథలను చదివేటప్పుడూ, వాడ్రేవు వీరభద్రరావుగారి ‘నేను తిరిగిన దారులు’ చదివేటప్పుడు మదిలో ఏదో తెలీని ఉద్విగ్నత. ఏదో మిస్ అవుతున్న భావన.
అరకు లోయ గురించి లోయ అందాల గురించి ఎన్నో చదివాను. కానీ....ఆ లోయ, ఆ లోయలో జీవితం గడుపుతున్న గిరిజనులు, వారి జీవన విధానం, వారి సమస్యలు, ఉనికి కోల్పోతున్న వారి జీవనశైలి, ఆధునికత పేరుతో వారి జీవన విధానంలో చేటు చేసుకుంటున్నమార్పులు తదితర విషయాలు వాడ్రేవు వీరభద్రరావు గారి ‘నేను తిరిగిన దారులు‘ లోని ‘అరకు దారుల్లో’ రచనలో
తొంగిచూసాయి. కేవలం అరకు అందాలే కాక, అక్కడ చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయన్న సత్యాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. చదువుతున్నంతసేపూ మనసు ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యింది. ఆ గిరిజనులను నేను కూడా ప్రత్యక్షంగా కలుసుకున్నానేమో అనిపించింది. తెలియని ఆవేదనకు గురయ్యాను. ఏడ్చేశాను.
ఒక మంచి పుస్తకం చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటే విజ్ఞానంతోపాటు వినోదం సొంతమవుతుంది. భాషాజ్ఞానం పెంపొందిం చుకోవడంలో కూడా పుస్తక పఠనం ఎంతో ఉప యోగపడుతుంది. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు ప్రస్తుతం ట్యాబ్ లు, పిసిలలో, పెద్ద స్మార్ట్ ఫోన్లలో చదువుకునేందుకు వీలుగా ‘ఈ బుక్స్’ కూడా లభ్యమవుతున్నాయి. దాంతో ఒక్క ట్యాబ్ చేతిలో ఉంటేచాలు మన ఓపిక.. ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. టెక్నాలజీపై, వివిధ సబ్జెక్టులపై, సైన్స్ ఫిక్షన్, హ్యారీపోట్టర్ లాంటి ఫాంటసీ కథలు ఎన్నో అంతర్జాలంలో లభ్యమవుతున్నాయి. వివిధ భాషలను నేర్చుకునేవారు తమ భాషాజ్ఞానం పెంపొందించుకునేందుకు, వివిధ భాషలను నేర్చుకునేందుకు ఈ ‘ఈ బుక్స్’ ఉపయుక్తంగా ఉంటాయి.
1 comment:
It's realy supper...message to our world tq soo much for oka manchi pustakam upload chesinaduku
Post a Comment